సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
ప్రతిపక్షం, సిద్దిపేట మే 13: ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిట్స్ పాఠశాలలో 114 పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
గతంలో కంటే ఎక్కువ పట్టణాలలో పోలింగ్ పెరుగుతుందని తెలిపారు. మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలని కోరారు. ప్రజాస్వామ్యం బలపడలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ దేశం, గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు. ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు..
జిల్లా కేంద్రంలోని భారత్ నగర్ అంబిట్స్ పాఠశాలలో పోలింగ్ సరళిని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు పరిశించారు. ఈ సందర్బంగా రఘు నందన్ రావు మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో అర్బన్ ఏరియాలలో పోలింగ్ సరళి మందకొడిగా సాగుతోందన్నారు. విద్యావంతులు మేధావులు పోలింగ్ లో పాల్గొనాలని కోరారు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. హాలిడే ఉందని ఎంజాయ్ చేయకుండా ఓటింగ్ లో అందరూ పాల్గొనాలనీ కోరారు.