Australia beat India by 9 runs: మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్ భారత్ ఓటమి చెందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రేస్ హారిస్ (40), తాహిలా మెక్ గ్రాత్ (32), పెర్రీ (32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రాధా, పూజా, శ్రేయంక తలో వికెట్ తీశారు. తర్వాత లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్(54) కీలక ఇన్నింగ్స్‌తో చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. దీప్తి శర్మ(29), షఫాలీ వర్మ(20) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమ్యారు. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్ తలో రెండు వికెట్లు తీయగా..మేగాన్ షట్, ఆష్లీ గార్డనర్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే భారత్ సెమీస్ వెళ్లేందుకు అవకాశం ఉంది. నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి చెందితే భారత్ సెమీస్ వెళ్లేందుకు అవకాశం దక్కుతుంది.