ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఒక ఆటోలో తరలిస్తున్నారు రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు బుధవారం పట్టుకున్నారు. బానోతు శంకర్ అనే వ్యక్తి వెలిమినేడు గ్రామంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. కోళ్ల ఫారం వారికి అమ్మడానికి తరలిస్తుండగా.. పట్టుకున్నట్లు సివిల్ సప్లై డిటి లింగస్వామి తెలిపారు. దీంతో నిందితునిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎవరైనా పిడిఎఫ్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లయితే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.