భారీ వర్షాలు, వరదలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. మహబూబాబాద్‌లో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ 4 గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి.