Heavy Rain in telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతం వద్ద ఆవర్తనం ఏపీ తీరానికి దగ్గరగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సిద్ధిపేట, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.