Heavy Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జనగాం, జగిత్యాల, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే వచ్చే మూడు రోజులు ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.



























