Janasena Leader Nagababu Tweet Viral: తెలంగాణలో తీసుకొచ్చిన హైడ్రాపై జనసేన నేత, నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాగబాబు హైడ్రాకు మద్దతు తెలిపారు. భారీ వర్షాలకు పడి తూములు తెగిపోయి, చెరువులు నాళాలు ఉప్పొంగి అపార్ట్‌మెంట్‌లకు సైతం నీళ్లు వెళ్లడం, కొంతమంది సామాన్యుల ప్రాణాలు బలికావడం చాలా బాధాకరమని చెప్పారు.
ఈ పరిస్థితులకు ప్రధాన కారణం.. చెరువులను, నాళాలను అక్రమ కబ్జా చేసి నిర్మాణాల చేపట్టడమేనన్నారు. ఇప్పటికైనా అర్థమైందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్. పర్యావరణాన్ని మనం రక్షిస్తే..అది మనల్ని రక్షిస్తుందని, అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే.. కచ్చితంగా మనల్ని అదే శిక్షిస్తుందంటూ ఆయన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ ధైర్యంగా తీసుకొచ్చిన హైడ్రాకు అందరూ సపోర్టు చేయాలని కోరారు.
కాగా, హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, కుంటలు, నాలాలు, చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేతలు చేస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను కాపాడాలని సీఎం స్పష్టం చేశారు.