ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసుల పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులకు చిక్కింది.
పట్టుబడిన మద్యం వివరాలు..
బాచుపల్లి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.21,53,470 విలువగల 2597.88 లీటర్ల మద్యం పట్టుబడింది. దీంతో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే పేట్ బషీరాబాద్ పీఎస్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.15,46,340 విలువగల 1916.2 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. ఎస్‌వోటీ బాలానగర్ టీం, కేపీహెచ్‌బీ పోలీసులు రేడియంట్ మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఎటువంటి క్యూఆర్ కోడ్ లేకుండా తరలిస్తున్న రూ.1,24,626 నగదును పోలీసులు పట్టుకున్నారు.