ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 25 : ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది అందరి సహకారంతోనే నిర్మల్ డిపోకు భారీగా ఆదాయం సమకూరిందని నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి డిపోకు ఒకే రోజు రూ. 40,51,267 ఆదాయం సమకూరిందని నిర్మల్ డిపో నుండి ఆంధ్రప్రదేశ్ లోనే అమలాపురం, ఉదయగిరి, కందకూరు, పామూరు, గుంటూరు, ఒంగోలు రూట్లలతో పాటు ఇతర రోడ్ల ద్వారా ఆదాయం సమకూరిందని వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ అభినందించారు.