ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 29: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన ప్రముఖ కవి రచయిత పురోహితులు అక్కినేపల్లి భీష్మాచారి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ప్రకృతి ప్రజా సమస్యలు కరోనా విపత్కర పరిస్థితుల మీద సందేశాత్మక రచనలు చేసిన ఆయనకు తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్టు సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. మాచవరం గౌరీ శంకర్, ధర్మ శ్రీ దైవజ్ఞ శర్మ, జబర్దస్త్ నటుడు అప్పారావు, అయోధ్య రాముడి పాదాలు తయారుచేసిన పిట్టంపల్లి రామలింగా చారి, యాదాద్రి ఆలయ రూపకర్త స్థపతి బ్రహ్మశ్రీ ఆనంద్ వేలు చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇటీవల ఆయన “రంగు తువ్వాల” పాట రచించి, చిత్రీకరణ చేసి ప్రేక్షకాదరణ పొందారు.