Trending Now

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 7 : అప్పటికే ఆ కుటుంబం అంతా బాధ తప్ప హృదయాలతో తమ రోజువారి జీవన భారాన్ని కన్నీళ్ళతో మోసుకెళ్తుంది. గత ఏడాది అనారోగ్యంతో భార్య మృతి చెందగా ఉన్న కూతుర్ని అష్ట కష్టాలు పడుతూ జీవన భారాన్ని మోసుకెళ్తున్న భోనగిరి లక్ష్మణ్ కు భరించలేని రీతిలో దేవుడు బాధల భారాన్ని మోపుతూనే ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్(బాగులవాడ) లో ఓ కూనల ఇంట్లో నివాసం ఉంటున్న రోజు వారి కూలి బోనగిరి లక్ష్మణ్ ఇంట్లో మధ్యాహ్నం ఒకేసారి మంటలు చెల్లరేగాయి. బోనగిరి లక్ష్మణ్ రోజువారి కూలీ కి వెళ్ళగా కూతురు ప్రైవేటు చదువులు చదువుకునేందుకు వెళ్ళింది. గమనించిన పరిసరాల్లోని వారు వెంటనే అప్రమతమై మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన మంటలు మరింత చెలరేగుతుండటంతో నిర్మల్ అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అగ్నిమాపక శాఖ వాహనం మంటలను ఆర్పే లోపే ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి నిత్యవసర సరుకులు మొత్తం ఖాళీ బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. బోనగిరి లక్ష్మణ్ కన్నీళ్ల పర్యంతమవుతూ తన ఇల్లును చూస్తూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి తో పాటు బట్టలు నిత్యవసర సరుకులు నగదు కాలీ బూడిదయ్యాయి. గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఉన్న కూతురు ను ఉన్నత చదువులు చదివించి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతానన్న ప్రగడ ఆశతో అష్ట కష్టాలు పడుతున్న భోనగిరి లక్ష్మణ్ కు దేవుడు సార్ సర్కిల్ రూపంలో భరించలేని బాధని ఇచ్చాడు. సుమారు రెండు లక్షల మేర నష్టం వాటిల్లగా తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాన్ని వెంటనే అందేలా చూసి తన ఈ కూనల ఇల్లును పూర్వరూపం ఇచ్చుకునేలా సహకరించాలని ఆయన వాపోయాడు. పరిసరాలలోని వారు వెంటనే తమదైన రీతిలో ఆయనకు సహాయం సహకారం అందించి మనోధైర్యాన్ని ఇచ్చారు.

Spread the love

Related News

Latest News