ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇస్తారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘హత్యా రాజకీయాలు చేసేవారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. బాబాయి హత్యపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? కడప ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. వైఎస్‌లాగా ప్రజాసేవ చేస్తా. కడప ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి’ అని ఆమె కోరారు.