జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
ప్రతిపక్షం, హైదరాబాద్, ఏప్రిల్ 8: తనిఖీల్లో భారీగా నగదు సీజ్ చేసిన్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లాలో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 7,30,400/- నగదు, 11,62,203/- రూపాయల విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. నగదు, ఇతర వస్తువుల పై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు, 4 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 కోట్ల 69 లక్షల 71 వేల 620 రూపాయల నగదు, ఒక కోటి 85 లక్షల 22వేల 705 రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు రోనాల్డ్ రోస్ తెలిపారు.