ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మృతుల్లో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేశ్ ఉన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.