ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లా, పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటుచేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే రాత్రి సమయంలో జరగడంతో కంపెనీలో ఎవరు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.