భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. గతంలో ఎన్నడు లేనంతగా కురుస్తున్న కుండపోత వానలతో నదులు, వాగులు, వంకలు పొంగు పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు కృష్ణానదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తూళ్లూరు మండలంలోని లంగ గ్రామాలు పరిస్థితి దుర్భరంగా మారింది. రాయపూడి పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు 300 మంది గ్రామస్థులను సమీపంలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పునరావాస కేంద్రానికి తరలించారు. ఇంకా సుమారు 70 మంది బాధితులు పెదలంకలోనే ఉన్నారు. వారంతా ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. హెలికాఫ్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.