Trending Now

హైదరాబాద్‌, గుజరాత్‌ మ్యాచ్‌కు వాన గండం..

మ్యాచ్‌ రద్దయితే పరిస్థితేంటి..?

హైదరాబాద్​, ప్రతిపక్షం, స్టేట్​బ్యూరో: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్‌లోనూ భారీ వర్షం కురుస్తుండటంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్‌ రద్దయితే ఎలా..?

ఇవాల్టి మ్యాచ్‌ రద్దయినప్పటికీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఫిక్సవుతుంది. అదే వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్‌ రద్దయితే గుజరాత్‌, హైదరాబాద్‌ జట్లకు చెరో రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే అప్పుడు 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినట్లే అవుతుంది. ఇక పంజాబ్‌తో జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలిస్తే టాప్‌-2కి వెళ్లే ఛాన్స్‌ ఉంది.

Spread the love

Related News

Latest News