Trending Now

Hyderabad Metro: మెట్రో రెండో దశకు అంచనా వ్యయం రూ.24,269 కోట్లు

Hyderabad Metro Rail Second Phase Estimation Cost: హైదరాబాద్‌లోని మెట్రో రెండో దశకు త్వరితగతిన అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రెండోదశలో 5 కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. ఈ మేరకు ఫోర్త్‌ సిటీ మినహా మిగిలిన 5 కారిడార్లకు 76.2 కి.మీ.కు రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్‌లో అధికారులు పేర్కొన్నారు. దసరా నాటికి డీపీఆర్‌లు సమర్పించాలని ప్రభుత్వం తొలుత నిర్దేశించింది. ఈ నెల 7న ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సీఎం రేవంత్​రెడ్డి భేటీ ఖరారు కావడంతో ఆ పర్యటనకు ముందుగానే డీపీఆర్‌లు కావాలని సీఎం కార్యాలయం కోరింది. దీంతో 7వ తేదీ నాటికి డీపీఆర్‌లను ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు సంస్థ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్‌లు పంపగా.. కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.

Spread the love

Related News

Latest News