‘Hydra’ inviting tenders for demolition waste: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కట్టడాలు ఎక్కడ కనిపించినా తుడిచిపెట్టేస్తున్న ‘హైడ్రా’ మరింత వేగంగా పనిచేస్తోంది. మొన్నటి దాకా వారాంతాల్లో కూల్చివేత ప్రక్రియలు చేపట్టిన హైడ్రా.. ప్రస్తుతం కూల్చివేత వ్యర్థాలు తొలగించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు హైడ్రా అధికారులు టెండర్లకు కూడా ఆహ్వానించారు. గురువారం నుంచి ఈ నెల 27 వరకు బిడ్లు స్వీకరించనున్నారు. ఆఫ్‌లైన్‌లోనే టెండర్ల పక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక, ఇప్పటి వరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైదరాబాద్‌లోని పలుచోట్ల చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే.