Hydra Report To Telangana Government: రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా..తాజాగా హైదరాబాద్ కూల్చివేతలపై స్టేటస్ రిపోర్టు విడుదల చేసింది. ఇప్పటివరకు 18 చోట్ల కూల్చివేతలు జరిగాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు. చెరువులు, నాలాలకు ఆనుకోని ఉన్న 43 ఎకరాల స్ట్రక్చర్ తొలగించినట్లు చెప్పారు. తుమ్మడికుంటలో 4.9 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ కూల్చినట్లు ప్రకటించింది. ఇక, గండిపేట చెరువులో మొత్తం 15 ఎకరాల ఆక్రమణలు తొలగించినట్లు తెలిపారు.
ఇప్పటివరకు పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, చింతల్ బీఆర్ఎన్ నాయకుడు రత్నాకర్ రాజ్‌లకు చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతోపాటు గాజులరామారం, అమీర్ పేట్, చందానగర్, రాజేంద్రనగర్, బాచుపల్లి, బోడుప్పల్, గండిపేట, మాదాపూర్‌లలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా రిలీజ్ చేసిన నివేదికలో పేర్కొంది.