సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలకు కూడా విస్తరిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరగడానికి కారణం అక్రమ కట్టడాలేనని అన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ఆక్రమణలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందేన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ‘హైడ్రా’ ముందుకు వెళ్తుందన్నారు. చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యమని.. చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. నాళాల ఆక్రమణలను ఉపేక్షించేదిలేదని.. కబ్జాలు, ఆక్రమణలు చేసేవారు ఎంతటివారైనా వదిలేదిలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.