ప్రతిపక్షం, హనుమకొండ: పట్టణంలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రమా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన ఆరూరి బుధవారం ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన మెత్తబడలేదు. ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో ‘జై ఆరూరి’ అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు. కాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.