ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తాను లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎంపీ మాలోతు కవిత స్పష్టం చేశారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఊహాగానాలు రావడంతో ఆమె స్పందించారు.