ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను మీ ఇంటి బిడ్డను ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను.. ఎన్నో ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఇచ్చింది బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని.. కొన్ని యూట్యూబ్ చానల్స్ దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాటిని పట్టించుకోవద్దని ఆయన కోరారు. త్వరల్లో ప్రత్యక్షంగా ప్రతి కార్యకర్తను, అభిమానులను కలుస్తాను. ఈరోజు, రేపు రాష్ట్రంలోని జిల్లాలోని ముఖ్య నాయకులను ఎమ్మెల్యేలను కలుస్తాను వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని తెలిపారు.