ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. మా ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చిన నేను పార్టీ మారేది లేదని స్పష్టంచేశారు. రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడి చేశారని.. కేసులు కూడా పెట్టారన్నారు. ‘తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. నా గురించి వాస్తవాలు తెలుసుకొని పత్రికల్లో రాయాలి. ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లాను. ఫోన్ ట్యాపింగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రణీత్ రావు అనే వ్యక్తితో పరిచయం కూడా లేదు. శరణ్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నారు.