ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..!
ప్రతిపక్షం, బోథ్ ప్రతినిధి, మే 31: అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ పేరుకే ఏజెన్సీ గ్రామపంచాయతీ.. కానీ 16 వార్డులు గల మహా పంచాయతీ, గత నెల చివరి వరకు గ్రామపంచాయతీ పాలకవర్గం చే నడపబడిన మహా గ్రామపంచాయతీ.. కానీ పారిశుద్ధ్యంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చంధంగా గ్రామపంచాయతీ అభివృద్ధిలో ఎండమావిగా కనిపిస్తుంది. పలు జిల్లాలకు, అంత: రాష్ట్రాలకు అనుసంధానంగా, ముఖ్యమైన గ్రామంగా ఉన్న ఇచ్చోడ లో మురికి నీరు ప్రవాహం ఇప్పటికీ సరిగ్గా లేకపోవడం.. గత నెల వరకు పాలించిన పంచాయతీ పాలకవర్గం పనితీరు కు నిలువుటద్దంగా నిలుస్తుంది.
అక్రమ కట్టడాలు, మురికి కాలువల మూసివేత, ప్రధాన రోడ్డుపై దశ దిశ లేని మురికి నీరు ఇప్పటికీ ప్రవాహం, నివాస స్థలాలలో నిలిచి ఉన్న మురికి నీరు, గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న మురికి కాలువలపై కబ్జా కోరులు అక్రమ కట్టడాలు చేసిన చూసి చూడనట్టుగా వ్యవహరించిన గత పాలకుల నిర్లక్ష్యంకు నిలువుటద్దంగా నిలిచి ఉంది.. వేచి చూద్దామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.