Trending Now

Teenmar Mallanna: రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో తిరగలేరు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీపైన, ప్రభుత్వంపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని అన్నారు. అంతేకాదు, రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని, రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో బీపీ మండల్‌ జయంతి సందర్భంగా బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడారు.

బీసీలను గెలిపించేందుకు అవసరమైతే కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానన్నారు. బీసీల సహకారంతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని ఎద్దేవా చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వనని అన్నారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పారు. అంతే తప్ప బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోనని అన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలు, పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Spread the love

Related News

Latest News