Trending Now

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా యాక్ట్ 30 అమలు..

నిర్మల్ జిల్లా ఎస్పీ డా జి.జానకి షర్మిల

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు 01 మే 2024 నుండి 31 మే 2024 వరకు, జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల గురువారం తెలిపారు. ఈ 30 పోలీస్ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదు. నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను, జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట, ధరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో నిషేధం. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన 30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అగుదురని ఎస్పి గారు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News