హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఫోన్ట్యాపింగ్కేసు విచారణలో నిత్యం కొత్త కొత్త కోణం బయటపడుతూనే ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ బంధువు అయిన రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు ప్రమేయం బాగా ఉందని, ఆయన ఇంటి నుంచి ట్యాపింగ్ కొనసాగినట్లు విచారణ అధికారులకు సమాచారం వచ్చింది. ప్రణీత్‌రావు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 4న ధ్వంసం చేసిన వస్తువులను నాగోల్ మూసీ కాలువలో కొన్ని, వికారాబాద్ ఫారెస్ట్‌లో మరికొన్ని పడేసినట్లు విచారణలో తేలింది. మాదాపూర్‌లోని ఓ ఛానెల్ ఎండీ ఆఫీస్‌లో ట్యాపింగ్ సెట్ ఏర్పాటు చేశాడు ప్రణీత్‌రావు. ఈ ఆఫీస్‌కి తరచూ వరంగల్, ఖమ్మం నేతలకు వచ్చి వెళ్తుండేవారిని చెప్పాడు. SIB సిబ్బందితో పాటు పలువురు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకుని ట్యాపింగ్‌కి పాల్పడ్డాడు. మాదాపూర్ ఆఫీస్‌లోని డీవీఆర్ సేకరించిన పోలీసులు ఆఫీస్ కేంద్రంగా జరిగిన వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.మరోవైపు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో ఈ ఉదయం సోదాలు జరిగాయి.
మజీ చీఫ్ ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఇంట్లో సోదాలు..
గత పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు యావత్ పోలీసుశాఖనే శాసించారు. ఎస్ఐగా ఎంపికైన రాధాకిషన్‌రావు కేసీఆర్ బంధువు కావడంతో ఆయనకు వెను వెంటనే పదోన్నతులు సైతం ఇచ్చేశారు. ఇంతెందుకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన డీసీపీ టాస్క్‌ఫోర్స్‌గా కొనసాగి, విపక్షనేతల ఇళ్లు, వాళ్ల అనుచరును నిత్యం బెదిరించేవాడన్న ఆరోపణలున్నాయి. ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు..అయితే ప్రభాకర్‌రావు, రాధాకిషన్ ఇద్దరు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.. ట్యాపింగ్ కేసు నమోదైన మరుసటి రోజే చెన్నై నుంచి అమెరికా వెళ్లిపోయారు ప్రభాకర్‌రావు. అటు ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, SIB డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు చేశారు. బంజారాహిల్స్ పీఎస్‌లో తిరుపతన్న, భుజంగరావుల విచారణ కొనసాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అదనపు సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులను ఉపయోగించుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మరికొంత మంది పోలీసు అధికారులను విచారించే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసు వర్గాలు తెలిపాయి.