ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాసేపట్లో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలంతా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమికి ఆయన ఆహ్వానం పంపనున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
చంద్రబాబు రెండో సంతకం దానిపైనే..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం CM హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని TDP ప్రకటించింది.