నిర్మల్‌లో చెట్ల కొమ్మలు కొట్టివేసి విద్యుత్ దీపాల ఏర్పాటు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : వాతావరణ శాఖ పదేపదే ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నాడటంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా ఆజాద్ నగర్,ఈద్గాం చౌరస్తా, ప్రియదర్శిని నగర్ అస్రా కాలనీ, రాం నగర్ ,విజయనగర్ కాలనీ తదితర వీధులలో నిర్మల్ టౌన్ 2 ఏఇ వెంకటపతిరాజు, ఏరియా లైన్ ఇన్స్పెక్టర్ నరేందర్, లైన్ మెన్ రషీద్, జూనియర్ లైన్ మెన్ చందు,సుభాష్ ల పర్యవేక్షణలో ఈద్గాం ,మంజులాపూర్ జాతీయ ప్రధాన రహదారిపై ఇరువైపులా ఏపుగా పెరిగి ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను కొట్టివేశారు. సదరు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలపై ఉన్న తీగల ఇతర సమస్యలను సరి చేశారు.
దీనికి తోడు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది సదర్ ప్రాంతాలలో ఉన్న వీధి స్తంభాలకు అత్యవసరం ఉన్న వీధి దీపాలను వెంటనే పెట్టుకోవచ్చునని పురపాలక సంఘం అధికారులకు సూచించడంతో స్తంభాలకు వీధి దీపాలను కూడా పురపాలక శాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఏపూవుగా పెరిగి ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలు ఈదురుగాలులు వర్షాలు కుడిచినప్పుడు తీగలకు తగిలి గంటల తరబడి సదరు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ విషయాన్ని ముందస్తుగా గుర్తించి వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల ఆధారంగా తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు మూడున్నర గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేసి చెట్ల కొమ్మలు తొలగించడంతోపాటు ఇబ్బందులుగా ఉన్న విద్యుత్ సరఫరా లైన్లో సరి చేయడం జరిగిందని నిర్మల్ పట్టణ -2 ఏ వెంకటపతి రాజు సందర్భంగా తెలిపారు.