ప్రతిపక్షం, హైదరాబాద్ మార్చి 28: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో వివిధ ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీ సందర్భంగా మొత్తం 23 లక్షల 92 వేల 610 రూపాయలు నగదుతో పాటు 14,66,994 రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 6 గంటల గడిచిన 24 గంటల వ్యవధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా 1,01,610 రూపాయలు, పోలీస్ శాఖ ద్వారా 19,61,000 రూపాయలు, యస్ యస్ టి బృందాల ద్వారా 3,30,000 రూపాయల నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 10 ఫిర్యాదులు రాగా వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరించడం జరిగింది. అదే విధంగా 5 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసినట్లు తెలిపారు.
నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుండి గత గడిచిన 24 గంటల వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటి వరకు 1,68,300 రూపాయలు, పోలీస్ శాఖ ద్వారా 1,68,65,300 రూపాయల, యస్ యస్ టి ద్వారా 4,80,000 రూపాయల నగదు మొత్తం 2,80,9800 రూపాయల నగదు సీజ్ చేశారు. అంతేకాకుండా 51,72,283.5 రూపాయల విలువ గల ఇతర వస్తువులు పట్టుకొని సీజ్ చేశారు. గడిచిన 24 గంటలలో 131.19 లీటర్ల మద్యం పెట్టుకోవడమే కాకుండా 2 కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 109 కేసులు నమోదు చేయడమే కాకుండా 110 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 129 మంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు 166 ఫిర్యాదులు పరిశీలించి పరిష్కారం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ తెలిపారు.