ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 1 : ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు బండి సంజయ్ పోరాట పటిమకు ఆకర్షితులై కోహెడ మండలంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారని హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం ఆధ్వర్యంలో వింజపల్లి ఎంపీటీసీ ద్యాగటి సురేందర్, తంగాళ్లపల్లి వేణుగోపాస్వామి దేవస్థానం చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అన్నాడి లక్ష్మారెడ్డి, తో పాటుగా శనిగరం, గుండారెడ్డిపల్లి, తంగాళ్లపల్లి, వింజపల్లి, తీగలకుంటపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు మోగిలిపాలం కృష్ణంరాజు, మాడ రాజిరెడ్డి, గుజ్జు ధర్మయ్య, గికురు శ్రీనివాస్ రేవోజు శ్రీనివాస్, పుట్ట లక్ష్మణ్, నెరేళ్ల సదానందం, సింగిరాల సంతోష్, కొట్టే రవీందర్ ఎండీ మైమత్ ఖాన్, ఆరేళ్ళ బాబు జేరుపోతుల సంతోష్, బొగుల శ్రీకాంత్, కుడుమల బాబు, మద్దెల వెంకటేష్, చిట్ట రవి, గుళ్ల సురేష్, చొప్పరి బన్నీ, పొత్తూరు సాగర్, మరాఠీ సాయి, పిల్లి శ్రీకాంత్, కొమ్మిడి బాల్ రెడ్డి, సాయిండ్ల సంపత్, మెతుకు శేఖర్ రెడ్డి, తో పాటుగా వివిధ గ్రామాల నుండి బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఏనుగుల సందీప్, బీజేపీ మండల ప్రధానకార్యదర్శి పిల్లి నర్సయ్య గౌడ్, బీజేపీ మండల కార్యదర్శి గాజుల వేంకటేశ్వర్లు, బీజెవైఎం మండల అధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, నాయకులు నాగు అజయ్, శతాబోయిన హరీష్ యాదవ్, అన్నాడి మధుసూదన్ రెడ్డి, విశ్వనాథం రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.