Trending Now

నిఘా బృందాలన్ని విధుల్లో ఉండాలి.. కలెక్టర్ మను చౌదరి

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్దిపేట మార్చి 21: లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. మనుచౌదరి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఎంసిసి, ఎక్స్పెండిచర్ అబ్జర్వేషన్ బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున వెంటనే జిల్లాలో ఏర్పాటు చేసిన నిఘా బృందాలు అన్ని పూర్తిస్థాయిలో విధులలో ఉండాలని అన్నారు. ఎన్నికల సంఘం జిల్లా స్థాయిలో నిఘా బృందాల పనితీరుపై ప్రత్యేక ఫొకస్ పెట్టిందని అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. అన్ని నిఘా బృందాలు పగడ్బందీగా తమ విధులను నిర్వహించాలని అన్నారు. ఎలక్షన్ కోడ్ ను అనుసరించి ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేటు స్థలాలలో ఏర్పాటు చేసిన అన్ని రకాల ప్రచారం హోర్డింగులు ప్లెక్సీలు పోస్టర్లు వాల్ పేపర్లను పూర్తిస్థాయిలో తొలగించాలని అన్నారు.

ప్లయింగ్ స్క్వాడ్ బృందాల వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం పెట్టామని, స్టాటిక్ సర్వేలెన్స్ టీం ల వద్ద సిసి కెమెరా, వీడియో, హ్యాండ్ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. నిఘా బృందాల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పనిచేయాలని అన్నారు. సీజ్ చేసిన నగదు పది లక్షల లోపు ఉంటే జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని 10 లక్షలు దాటితే ఇన్కమ్ టాక్స్ నోడల్ ఆఫీసర్ కు అందజేయాలని అన్నారు. బ్యాంకులకు సరఫరా అయ్యే నిధుల పై కూడా ప్రత్యేక నిఘాబెట్టి అనుమతికి మించిన నగదు సరఫరా కాకుండా చూడాలని అన్నారు. సీ -విజీల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనుమతులకు మించి లిక్కర్ సరఫరా కాకుండా ఎక్సైజ్ శాఖ తోపాటు నివారణ బృందాలు ఫోకస్ చేయాలని అన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత ఏఆర్ఓకు, జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం అందించాలని అన్నారు.

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మాట్లాడుతూ..

జిల్లాలో నాలుగు నియోజకవర్గాలచేసిన పరిధిలో 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని నిఘా బృందాల పనితీరును కంట్రోల్ రూమ్ నుండి పరిశీలిస్తాం, ప్రొసీజర్ ప్రకారం.. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ట్రబుల్ మన్గర్స్ ను కేడీలను బీసీలను సస్పెక్ట్ లను బైండోవర్ చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ దుబ్బాక ఏఆర్ఓ గరిమ అగ్రవాల్, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, డిఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట, హుస్నాబాద్ ఏఆర్వోలు సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News