Trending Now

Actress Rohini: నటీమణులపై అనుచిత వ్యాఖ్యలు.. నటి రోహిణి ఫిర్యాదు

Rohini lodges complaint against doctor: కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమ కమిషన్‌ తరహాలోనే కోలీవుడ్‌లోనూ నడిగర్‌ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. అయితే తమిళనాడుకు చెందిన డాక్టర్‌ కందరాజ్‌పై నటి రోహిణి చైన్నె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన తమిళ నటీమణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

డాక్టర్‌ కాంతరాజ్‌ ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో సినీ, రాజకీయ రంగాలను విశ్లేషిస్తుంటారు. ఈ క్రమంలో సినీ నటీమణులందరూ వ్యభిచారులే అన్నట్లు మాట్లాడారు. అలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసిన డాక్టర్‌ కాంతరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆ యూట్యూబ్‌ ఛానల్‌లోని ఆయన ఇంటర్వ్యూను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. కాగా, కందరాజ్‌ గతంలోనూ కొన్ని వివాదాలకు తెర లేపడం గమనార్హం.

Spread the love

Related News

Latest News