ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 05: చిన్నకోడూరు మండలం అల్లీపూర్ లో శుక్రవారం ఐకేపీ ఏపిఎం మహిపాల్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమనికి హాజరైన కాంగ్రెస్ నాయకులు మీసం మహేందర్ యాదవ్ మాట్లాడుతూ.. కొనుగోలు సెంటర్ కు వడ్లు తీసుకువచ్చే ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం, నీడ వసతి కల్పించాలని, కొనుగోలు సెంటర్లో సీసీ లేనందున రైతులకు ప్రతి ఒక్క రైతుకు కనీసం ఒక్క టర్పలిన్ కవర్ అందించే విధంగా చూడాలని ఏపిఎం ను కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు సెంటర్కు మాత్రమే ధాన్యాన్ని తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దనీ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాణి, వివో లీడర్స్ భాగ్యవ్వ, రైతులు మీసం రాజు, మంకాళి యాదగిరి, కోడెల నాగరాజు, బోనాల మధు ఉడుత ప్రశాంత్, కవ్వం వనాకర్ గీకుర్ బాలయ్య, కుంభాల శేఖర్, బోయ సురేష్, దొంతి రాజు,కామ కొమురయ్య, కొలనుపాక బాపురెడ్డి, పిల్లి నర్సింహా,హమాలీ సంఘము వారు ఎల్లయ్య, రాజయ్య, శ్రీను, దేవయ్య, కుమార్, కురుమ శీను తదితరులు పాల్గొన్నారు.