ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 26 : తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం వారు నిర్వహిస్తున్న “లౌకిక విలువలు – సాహిత్యం ” అన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు వరంగల్ లో 28 ఏప్రిల్ 2024 ఆదివారం సెనేట్ హాల్, కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం డాక్టర్ దామెర రాములు సాహితి క్షేత్రంలో కరపత్రాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెరవే గౌరవాధ్యక్షులు డా. దామెర రాములు మాట్లాడుతూ.. లౌకిక సామాజిక రాజ్యాంగ రక్షణ కోసం కవులు, కళాకారులు, మేధావులు సమూహ గానం చేస్తున్నారన్నారు. అదే విధంగా శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం కోసం, దేశ ప్రగతి కోసం కవులు రచయితలు ముందుకు నడవాలని అన్నారు. తెరవే నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ కవి, ఉపాధ్యక్షులు అంబటి నారాయణ, ముఖ్య సలహాదారుడు పత్తి శివప్రసాద్, ఈసీ సభ్యులు కామారపు జగదీశ్వర్, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.