ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూలై 03 : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేశారు. ఈ సందర్భంగా డీఈవో రవీందర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి కే రాజన్న మాట్లాడుతూ.. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ ను వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోడికూతతో పనులు ప్రారంభించి రాత్రి 8 గంటల వరకు వారు విధులు నిర్వహిస్తుంటే వారి బాదాలను పట్టించుకునే నాధుడే కరువయ్యారని విమర్శించారు.
ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవటం లేదని ఆంధ్రప్రదేశ్ లో నా టీచింగ్ వర్కర్స్ కు ఏఎన్ఎమ్ కు 17,755,రూపాయలు ఉంటే మన దగ్గర 14,300 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. క్రాప్ కంప్యూటర్ ,అటెండర్ ,కుక్సు ,స్వీపర్, డే అండ్ నైట్ వాచ్మెన్ ,స్కావెంజర్ ,హెల్పర్స్ ,కు ఆంధ్రప్రదేశ్లో 14,203 రూపాయలు,చెల్లిస్తుంటే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 9,750 రూపాయలు మాత్రమే నెలకు చెల్లిస్తున్నారని అన్నారు. ఇవి ఏమాత్రం సరిపోవటం లేదని బయట పనులు చేస్తే కనీసం రోజు కూలి 500 రూపాయలు దొరుకుతుందని, ఉపాధి హామీ పనికి 300 రూపాయలు పెరిగిందని చెప్పారు. వీరు బతుకులు మాత్రం మారడం లేదని వివరించారని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు దరిద్రరేఖకు దిగువన జీవిస్తున్న వారికి వారి కుటుంబాలను ఆదుకోవడానికి 2016 రూపాయలు ఆంధ్రలో 4000 రూపాయలు పెన్షన్ చెల్లిస్తుంటే ఇక్కడ పనిచేసిన వారికి కనీసం ఆ విధమైనటువంటి ప్రోత్సహం కూడా లేకుండా పోయిందని చెప్పారు.
పొద్దస్తమానం పనిచేసిన ఎలాంటి ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదని నెలకు కనీస వేతనాలు 26 వేల రూపాయలు చెల్లించాలని విద్యార్థులకు టిఫినీలు చేయడానికి పూరి చపాతీలు ఏర్పాటు చేసి సమయంలో అధిక పని భారం పడుతుందని వాటికి మిషనరీ సౌకర్యాలు కల్పించాలన్నారు., కేజీబీవీ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఏఎన్ఎమ్ లకు నైట్ డ్యూటీలను తగ్గించి రెండవ నియమించాలని డిమాండ్ చేశారు. ఈ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిచో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముట్టడి చేస్తామని హెచ్చరించారు, కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం ,(పిఓడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి కె లక్ష్మి, జిల్లా కార్యదర్శి కవిత, జయసుధ, పార్వతి లక్ష్మి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.