ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 14 : నిర్మల్ జిల్లాలో గతంతో పోల్చుకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగింది. జిల్లా ఎన్నికలఅధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమృతమయ్యాయి. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు, మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయి. సోమవారం నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ శాతం అర్ధరాత్రి అధికారులు వేసిన అంచనాలను దాటుతూ తేలింది. నిర్మల్ నియోజకవర్గం లో 71.68 శాతం, ఖానాపూర్ నియోజకవర్గం లో 70. 32 శాతం, ముధోల్ నియోజకవర్గం లో 74. 25% చొప్పున పోలి నమోదయింది. జిల్లాలో మొత్తం 7.34,416 ఓటర్లు ఉండగా.. మొత్తం 926 పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గాల వారీగా జరిగిన పోలింగ్ శాతం ఇలా ఉంది. ఓటర్లుతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలలో అత్యధికంగా యువ ఓటర్లు, మహిళలు పోటీపడి ఓట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు.