IND vs BAN Test Match: బంగ్లాదేశ్‌తో భారత్ రెండు టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్ట్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో యంగ్ అండ్ డాషింత్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కింది.
భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రణ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.