Trending Now

IND vs ENG: నాలుగో టెస్టులో భారత్‌ విజయం.. సిరీస్ మనదే

ప్రతిపక్షం, స్పోర్ట్స్: రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనను 5 వికెట్లను కోల్పోయి పూర్తి చేసింది. టీమిండియా బ్యాటింగ్ లో.. శుభ్‌మన్‌ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి విజయతీరాలకు చేర్చారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే.. 3-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది.

Spread the love

Related News

Latest News