ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 64 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో భారత్ 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 218, రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ ఒక్కడే రాణించి 84 పరుగులు చేశాడు.