India beat Bangladesh by seven wickets: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ఈ మేరకు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. 128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16), శాంసన్ (29), సూర్యకుమార్ యాదవ్ (29),నితీశ్‌కుమార్ రెడ్డి (16), హార్దిక్ పాండ్య (39) రాణించారు.
అంతకుముందు బంగ్లా జట్టులో మెహిదీ హసన్ మిరాజ్ (35*) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27) ఫర్వాలేదనిపించాడు. తౌహిద్ హృదయ్ (12), తస్కిన్ అహ్మద్ (12), రిషాద్ హొస్సేన్ (11) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్‌దీప్ సింగ్ (3/14) అదరగొట్టారు. మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.