ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లిన మందాన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మందాన కుటుంబసభ్యులు కషాయ శాలువాలు కప్పుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో స్మృతి మందాన 149 పరుగులతో అదరగొట్టింది.