ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. “ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్. ఎస్సీల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారు. వైసీపీ హయాంలో ఎస్సీలకు అన్యాయం జరిగింది. ఎస్సీలకు కేటగిరీల వారీగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం.” అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వేదికగా నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.