Trending Now

ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ప్రతిపక్షం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, డాక్టర్ బోయినపల్లి మాధవి పాల్గోన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కర్రె పావని రవి మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో మహిళలు దూసుకుపోతున్నారని ఒకప్పుడు వంటింటికే పరమితమైన ఆడవాళ్లు వివిధ రంగాల్లో ముందుకు సాగుతున్నారన్నారు. ఈ సమావేశలో పాల్గొన్న వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి సన్మానం చేసి మోమోంటో అందించారు.

ముఖ్య అథితిగా డాక్టర్ బోయినపల్లి మాధవి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎందరో మహిళలు అన్ని రంగాలతో పాటు సమాజంలో మేము కూడ సేవ చేయడంలో తక్కువేం కాదని నిరూపిస్తూ.. ఎంతోమంది మహిళలు ఈరోజు స్వచ్ఛందల సంస్థల ద్వారా అనేకమందికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. అదేవిధంగా మేము కూడ ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ అనేక ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ.. మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Spread the love

Related News

Latest News