ప్రతిపక్షం, సిద్దిపేట. మార్చి 23: శ్రీ క్రోధి నామ ఉగాది 2024″ పురస్కారాల ఎంపికకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ అధ్యక్షులు లయన్ డా. ఇ ఎస్ ఎస్ నారాయణ మాస్టారు తెలిపారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 2024, శ్రీ క్రోది నామ తెలుగు సం॥ ఉగాది పండుగ పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలోని, జిల్లాలో మారుమూల పల్లెలో, పట్టణాలలో మట్టిలో మాణిక్యల్లాగా దాగి వున్న కవుల, కళాకారుల, రచయితల, విద్యావంతుల, ఉపాధ్యాయుల, మేథావుల, వైద్యుల, సమాజ సేవకుల, ఆద్యాత్మిక, యోగ గురువులు, కార్మికుల, కర్షకుల, క్రీడాకారుల, ప్రతిభను, సేవలను గుర్తించి వారికి “శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని” ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించి వారి ప్రతిభను, సేవలను ప్రోత్సాహించాలనే సదుద్దేశ్యంతో ప్రముఖ “ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమి” (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ) హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7, 2024 ఆదివారం హైదరాబాద్ లో 19 సంవత్సరాల “ఉగాది పురస్కారాల” ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇందుకు గాను సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల, వికాలంగుల, విద్యా, వైద్యం, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఉపాధి కల్పన, నాటకరంగం, టి.వి. సినీరంగాలలో సేవలందిస్తున్నవారు, ప్రతిభావంతులు పురస్కారాల ఎంపిక కొరకు వారి సేవాలను, ప్రతిభను, గురించి తెలియచేసే సర్టిఫికెట్స్, ఫోటోలు, పత్రికల క్లిప్పింగ్స్, గతంలో పొందిన పురస్కారాలు సర్టిఫికెట్స్ ఫోటోలు, జిరాక్స్ కాపీలతో పాటు 4 పాసు పోర్టు సైజు ఫోటోలను ధరఖాస్తుకు జత చేసి తేది 31-03-2024 లోపు మా ఆఫీసు అడ్రసు : ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమి, డోర్ నెం. 1-20-164, గోకుల్నగర్, వెంకటాపురం, పోస్టు : తిరుమలగిరి, సికింద్రాబాద్ – 15 నకు పంపించవలసినదిగా కోరారు. మరిన్ని వివరాలకు సెల్: 9652347207 ను సంప్రదించగలరు. ఈ సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షులు సూర్యతేజ సుబ్రనాథ్, ప్రధాన కార్యదర్శి సూర్య సుధా పాల్గొన్నారు.