ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL-2024 (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరిగగా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మే 21న క్వాలిఫైయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫైయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనున్నాయి. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగనుంది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుండగా.. రెండో క్వాలిఫయర్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.