ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ అధికారులు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఆదివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా పడింది. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపిఎల్ ప్రకటనలో పేర్కొంది.