ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL-2024 లో భాగంగా ఇవాళ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7:30 గంటలకి ప్రారంభంకానుంది. అయితే ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోగా.. శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, ఈ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్ జట్టులో కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్.. కావడంతో అనుకూలమైన జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఆర్సీబీని సొంత గడ్డపైనే ఓడించి రెండో గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలి అని కెప్టెన్ శిఖర్ ధావన్ చూస్తున్నారు.